ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్వాన్‌ ఎమ్మెల్యేను బెదిరించిన యువకుడి అరెస్టు

ABN, First Publish Date - 2021-03-04T11:49:26+05:30

కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ను ఫోన్‌లో బెదిరించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ను ఫోన్‌లో బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి రూ.50 లక్షలు   డిమాండ్‌ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్యే కుమారుడు జాఫర్‌ను కిడ్నాప్‌ చేస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. దీంతో ఎమ్మెల్యే బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కార్వాన్‌కు చెందిన బిలాల్‌ నిందితుడని తేలింది. మూడు నెలల క్రితం బిలాల్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతని చేయి రోడ్డు పక్కనే నిలబడ్డ కౌసర్‌ మొయినుద్దీన్‌ కుమారుడు జాఫర్‌కు తగిలింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి జాఫర్‌పై కోపం పెంచుకున్నాడు. గతంలో తాను పనిచేసే కల్యాణి బిర్యానీ సెంటర్‌కు వెళ్లి అందరితో నవ్వుతూ మాట్లాడి అక్కడున్న ఓ సెల్‌ఫోన్‌ చోరీ చేశాడు. ఆ ఫోన్‌తోనే ఎమ్మెల్యేను బెదిరించనట్టు తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-04T11:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising