ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయాపై అనుమానంతో సీసీటీవీ కెమెరాలో చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు!

ABN, First Publish Date - 2021-10-03T14:22:40+05:30

పుట్టిన చిన్నారిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్‌డెస్క్: పుట్టిన చిన్నారిని చూసుకోవడం కోసం ఓ ఆయను నియమించి.. దంపతులు ఇద్దరూ ఉద్యోగం నిమిత్తం ఆఫీసులకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చాకా ప్రతిరోజూ పాపాలో ఏదో మార్పు గమనించడం మొదలుపెట్టారు. ఆయాపై అనుమానం కలిగి సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. ఆఫీసుకు వెళ్లాకా ఇంట్లో ఏం జరుగుతుందోనని సీసీటీవీ ఫుటేజీని చూడగా తల్లిదండ్రులకు షాకింగ్ దృశ్యాలు కనపడ్డాయి. పదినెలల చిన్నారిపై ఆయా దారుణానికి పాల్పడడం చూసి విలవిలలాడిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే..


పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌కు చెందిన దంపతులు ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల చిన్నారి ఉంది. చిన్నారిని చూసుకోవడం కోసం ఓ ఆయను నియమించుకున్నారు. మొదట్లో ఆయా చిన్నారిని బాగానే చూసుకునేది. కానీ కొన్ని రోజుల తర్వాత చిన్నారిలో ఏదో భయం గమనించిన తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆయాకు తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టించారు. ఓ రోజు ఆఫీసుకు వెళ్లాకా ఇంట్లో ఏం జరుగుతుందోనని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా తల్లిదండ్రులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.



పదినెలల చిన్నారిపై ఆయా ఏమాత్రం కనికరం లేకుండా చితకబాదడం చూసి భయపడ్డారు. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆయా చిన్నారిని కొడుతుండడం చూసి తల్లిదండ్రుల ఫ్రాణం పోయినట్లైంది. వెంటనే ఇంటికి బయలుదేరారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చి ఆయాను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చిన్నారిని అంతలా కొట్టడానికి కారణాలేంటో తెలియరాలేదు. 

Updated Date - 2021-10-03T14:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising