ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chittoor: జలపాతంలో నీట మునిగి ఇద్దరు యువకుల మృతి

ABN, First Publish Date - 2021-10-14T13:36:45+05:30

చిత్తూరు జిల్లా నాగలాపురం మండల పరిధిలోని సద్దికూటి మడుగు జలపాతంలో ప్రమాదవశాత్తు నీట మునిగి తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం మృతిచెందారు. ఎస్‌ఐ హనుమంతప్ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు(చిత్తూరు): చిత్తూరు జిల్లా నాగలాపురం మండల పరిధిలోని సద్దికూటి మడుగు జలపాతంలో ప్రమాదవశాత్తు నీట మునిగి తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం మృతిచెందారు. ఎస్‌ఐ హనుమంతప్ప తెలిపిన వివరాల మేరకు... చెన్నై-మాధవరం ప్రాంతానికి చెందిన సంజయ్‌కుమార్‌, దేవా, విజయ్‌, సంతోష్‌, రమేష్‌, తులసినాథన్‌ అనే ఆరుగురు యువకులు చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు. వీరు విహారయాత్ర కోసం జలపాతం వద్దకు బుధవారం వచ్చారు. స్నానానికి దిగిన సంజయ్‌కుమార్‌, దేవా మడుగులో లోపలికి వెళ్లి బయటకు రాలేకపోయారు. గమనించిన మిగిలిన నలుగురు యువకులు కేకలు వేయడంతో అక్కడ పరిసరాల్లో ఉన్న కొందరు స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. నాగలాపురం ఎస్‌ఐ హనుమంతప్ప జలపాతం వద్దకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-14T13:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising