ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలానికి వెళ్లిన మహిళను తుపాకితో బెదిరించి సామూహిక అత్యాచారం

ABN, First Publish Date - 2021-10-13T00:17:59+05:30

గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళను తుపాకితో బెదిరించి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: గడ్డికోసం పొలానికి వెళ్లిన మహిళను తుపాకితో బెదిరించి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గడ్డికోసం ఓ మహిళ సమీపంలోని పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమె వద్దకు వెళ్లారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె వారిని గట్టిగా ప్రతిఘటించింది.


మహిళ వారిని గట్టిగా ఎదుర్కోవడంతో జీర్ణించుకోలేకపోయిన నిందితులు తుపాకితో బెదిరించి అత్యాచారానికి తెగబడి పరారయ్యారు. భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురికి కోసం గాలిస్తున్నారు.  


ఈ ఘటనపై కాంగ్రెస్, బీఎస్పీ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దళిత మహిళపై సామూహిక అత్యాచారం దారుణమని, సిగ్గుచేటని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-13T00:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising