ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవే రాగానే బైక్‌ను పక్కకు ఆపాడు.. ఏమైందని అడిగిన భార్యకు.. ఊహించని షాకిచ్చిన భర్త..!

ABN, First Publish Date - 2021-10-26T17:38:13+05:30

బయటకు వెళ్దాం రెడీ అవ్వు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్‌డెస్క్: బయటకు వెళ్దాం రెడీ అవ్వు... అంటే ఆమె సంతోషంగా గబగబా తయారైంది. కూతురిని కూడా రెడీ చేస్తుండగా.. పాప ఇక్కడే ఉంటుంది.. మనమిద్దరమే వెళ్దాం అని చెప్పాడు. సరే ఏదో పని ఉంటేగానీ ఇలా చెప్పడులే.. అనుకొని ఆమె అతడితో పాటు బయటకు వెళ్లింది. హైవే రాగానే బైక్‌ను పక్కకు ఆపాడు. ఏమైందని ఆమె అడుగుతుండగానే.. భారీ షాకిచ్చాడు. అతడు చేసిన పనికి ఆమె బిత్తరపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాలోని సఫ్దర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేలరాయిగంజ్ గ్రామంలో అరుణ్, జ్యోతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఓ కూతురు ఉంది. పని ఉందని జ్యోతిని అరుణ్ బయటకు తీసుకెళ్లాడు. బైక్ మీద ఉన్నంతసేపు ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని జ్యోతి ఆలోచించింది. హైవే రాగానే బైక్‌ను పక్కకు ఆపాడు. ఏంటి బైక్ ఇక్కడ ఆపారు అని జ్యోతి అడుగుతుండగానే.. అరుణ్ ఆమెకు బిగ్ షాక్ ఇచ్చాడు.



నిత్యం గొడవలు జరుగుతుండడంతో జ్యోతిని ఎలాగైనా చంపాలని అరుణ్ అనుకున్నాడు. పక్కా ప్రణాళికతోనే సోమవారం ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆ విషయం తెలియని జ్యోతి.. అతడితో బయటకు వెళ్లింది. హైవే మీద ఓ లారీ వస్తుండడం గమనించి బైక్‌ను రోడ్డు పక్కకు ఆపాడు. లారీ దగ్గరికి రాగానే.. ఆమెను దాని కిందకి తోసేశాడు. అరుణ్ చేసిన పనికి జ్యోతి బిత్తరపోయింది. జ్యోతి అదృష్టం కొద్దీ ఆ లారీ కింద పడలేదు. ఆమె ప్రాణాలతో బయటపడడంతో.. అరుణ్ అక్కడే ఓ కట్టెను తీసుకొని ఆమెను కొట్టి చంపాలని ప్రయత్నించాడు. అరుణ్ కట్టెతో కొడుతుండగా.. జ్యోతి గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న కొంతమంది వాహనాదారులు, బాటసారులు అక్కడకు వచ్చారు. వారి రాకను గమనించిన అరుణ్ అక్కడి నుంచి పారిపోయాడు. 


ఈ సంఘటనలో జ్యోతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం వాహనాదారులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి ఆమె కూతురిని కూడా తీసుకొచ్చారు. కూతురిని చూడగానే జ్యోతి కన్నీళ్లు ఆగలేదు. తాను చనిపోయింటే తన కూతురు ఒంటరి అయ్యేదని తీవ్రంగా దు:ఖించింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి వచ్చారు. జ్యోతి ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు అరుణ్‌ను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జ్యోతిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 



Updated Date - 2021-10-26T17:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising