ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొన్నాళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు.. తమ్ముడు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.. దీంతో ముగ్గురు అక్కాచెల్లెల్లు తీసుకున్న కఠిన నిర్ణయమిది..!

ABN, First Publish Date - 2021-11-19T18:58:36+05:30

ఆ దంపతులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు. నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. పనికి వెళ్లనిదే పూట గడవని పరిస్థితి వారిది. తండ్రితోపాటు కుమారుడు కూడా పనికి వెళ్తుండడంతో కాసిన్ని మెతుకులు తినేవారు. కానీ ఇటీవలే తండ్రి మరణించడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కుమారుడి ఒక్కడి సంపాదనపైనే ఆ కుటుంబం ఆధారపడింది. ఇటువంటి సమయంలో ముగ్గురు అక్కాచెల్లెల్లు కలిసి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమేంటో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..


జిల్లాలోని అహిరోలి గ్రామానికి చెందిన రాజేంద్ర, ఆశాదేవి దంపతులకు గణేష్, ఆర్తీ(20), ప్రీతి(18), కాజల్(15)తోపాటు మరో కూతురు ఉంది. వీరిది పేదకుటుంబం. ఇటీవలే రాజేంద్ర మరణించాడు. దీంతో గణేష్ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆశాదేవికి కంటి సమస్య ఉండడంతో ఆమెకు సరిగ్గా కనిపించదు. దీంతో ఆమె ఇంటి వద్దే ఉంటోంది. వయసుకు వచ్చిన చెల్లెల్లను పనికి తీసుకెళ్లడం గణేష్‌కు ఇష్టం లేదు. పనికి వచ్చి.. నీతోపాటు రెండు రూపాయలు సంపాదిస్తామని చెల్లెల్లు కోరగా అతను ఒప్పుకోలేదు. తమ్ముడు ఒక్కడే కష్టపడడం చూసి ఆర్తీ, ప్రీతి, కాజల్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 



గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చారు. మార్కెట్‌కు వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదేంటని వారి కోసం గాలించారు. ఎంత వెతికినా వారు కనిపించకపోయేసరికి కుటుంబసభ్యులకు భయమేసింది. కాసేపటికి గణేష్‌కు ఓ షాకింగ్ విషయం తెలిసింది. బయటకు వెళ్లిన సోదరిమణులు రైలు కింద పడి చనిపోయారని తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాడు. వారిని చూసి భోరున విలపించాడు. రైల్వేపోలీసులకు గేట్‌మ్యాన్ సమాచారమివ్వడంతో వారు కూడా వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.


సంజయ్ కుమార్ అనే పోలీస్ అధికారి మాట్లాడుతూ సోదరుడు ఒక్కడే కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించడం చూడలేక ముగ్గురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. 



Updated Date - 2021-11-19T18:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising