ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ స్కామ్.. అమెజాన్‌కే టోపీ .. లక్షల్లో సంపాదన!

ABN, First Publish Date - 2021-07-27T02:48:37+05:30

అమెజాన్‌కే వారు టోపీ పెట్టేశారు. లక్షల్లో సంపాదించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అమెజాన్‌లో వారు దాదాపు వంద అకౌంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత ఖరీదైన ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌ కోసం ఆర్డర్లు పెట్టారు. డెలివరీ అయిన వాటిని తక్కువ ధరకు అమ్మేశారు. ఆ తరువాత.. అమెజాన్ వారికి ఫోన్ చేసి వస్తువులు పాడయ్యాయని చెబుతూ రీఫండ్ అడిగారు. ఈ భారీ స్కామ్‌లో వారు అమెజాన్ డెలివరీ బాయ్‌ల సహాయం కూడా తీసుకున్నారు. డబ్బుకు ఆశ పడిన డెలివరీ బాయ్స్‌ కూడా వస్తువులను వెనక్కు తీసుకున్నట్టు తమ డేటాబేస్‌లో రికార్డు చేయడంతో  అమెజాన్ నుంచి రీఫండ్ వచ్చేది. ఇలా కొన్ని నెలల పాటు వారు అమెజాన్‌కు టోపీ పెట్టి లక్షల్లో సంపాదించారు.


కానీ.. నేరస్థులు ఎంతటి తెలివిగలవాళ్లైనా చివరకు దొరికిపోకతప్పదు. ఇటీవలే వీరికీ కాలం మూడటంతో ఉత్తరప్రదేశ్ పోలీసులకు దొరికిపోయారు. వీరిలో ఒకరు డిగ్రీ పట్టభద్రుడు కాగా.. మరొకరు పన్నెండో తరగతి పాసయ్యాడు. నకిలీ డాక్యుమెంట్లతో వారు కనీనం 99 అకౌంట్లు ఓపెన్ చేశారని పోలీసులు తెలిపారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న వారి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. అందులో 26 లక్షల రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుసుకుని పోలీసులే షాకైపోయారు. హరియాణాకు చెందిన ఈ ఇద్దరు నిందితులను నోయిడా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Updated Date - 2021-07-27T02:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising