ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ వేలిముద్రలతో బయోమెట్రిక్‌ హాజరు.. ఇద్దరి అరెస్ట్

ABN, First Publish Date - 2021-04-22T13:19:30+05:30

కొన్నేళ్లుగా నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల జీతాలు కాజేస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కార్మికులు విధులకు హాజరు కాకపోయినా జీతం 
  • ఇద్దరు ఎస్‌ఎఫ్‌ఏల అరెస్టు 

హైదరాబాద్‌ సిటీ : కొన్నేళ్లుగా నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల జీతాలు కాజేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. తలాబ్‌కట్ట భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌ హాజీ అహ్మద్‌ (38), మొఘల్‌పురాకు చెందిన మహ్మద్‌ లాయక్‌(42) భవానీనగర్‌ ప్రాంతంలో ఎస్‌ఎఫ్‌ఏలుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. తమ కుటుంబాలకు చెందిన ఐదుగురిని పారిశుధ్య కార్మికులుగా నియమించుకున్నారు. వారు విధులకు హాజరు కాకపోయినా నకిలీ వేలిముద్రలతో హాజరైనట్లు వారి జీతాన్ని కొన్నేళ్లుగా తీసుకుంటున్నారు. విషయం తెలియడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి 5 నకిలీ వేలిముద్రలు, రెండు బయోమెట్రిక్‌ మెషీన్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులిద్దరినీ, స్వాధీనం చేసుకున్న సామగ్రిని భవానీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-04-22T13:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising