ఇంటికి అతిథిగా వచ్చిన అల్లుడు ఎంతపని చేశాడో తెలిస్తే..
ABN, First Publish Date - 2021-09-30T18:02:06+05:30
నగర సమీపంలోని యరమరస్ క్యాంప్‌లో మంగళవారం అర్దరాత్రి ముగ్గురు మహిళలు దారుణహత్యకు గురికావడం కలకలం రేపింది. ఇంటికి అతిథిగా వచ్చిన అల్లుడే తన భార్యతోపాటు అత్త, మరదలిని
- ముగ్గురు మహిళల దారుణ హత్య
రాయచూరు(కర్ణాటక): నగర సమీపంలోని యరమరస్ క్యాంప్‌లో మంగళవారం అర్దరాత్రి ముగ్గురు మహిళలు దారుణహత్యకు గురికావడం కలకలం రేపింది. ఇంటికి అతిథిగా వచ్చిన అల్లుడే తన భార్యతోపాటు అత్త, మరదలిని అతి దారుణంగా చంపి పరారయ్యాడు. యరమరస్ క్యాంప్‌లో నివాసముంటున్న వైష్ణవికి ఆరు మాసాల క్రితం పెళ్లి కాగా పెళ్లైన వారం లోపే భార్య, భర్తల మధ్య గొడవ జరగడంతో అప్పటి నుంచి వైష్ణవి పుట్టింట్లోనే ఉంటుంది. తరచుగా ఫోన్‌లోను గొడవ పడుతున్న ఆమె భర్త సాయి(30) మంగళవారం రాత్రి అత్తవారింటికి వచ్చాడు. వచ్చే రాగానే వారితో ఘర్షణకు దిగిన ఆయన ఆవేశంలో తన భార్య వైష్ణవి(25)తో పాటు మరదలు ఆరతి(16) వారి తల్లి సంతోషి(45)లను కర్రతో బలంగా తల పై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం గమనించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-09-30T18:02:06+05:30 IST