ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త అలా చేయడంతో తట్టుకోలేకపోయిన భార్య.. చివరకు విషయం బయటపడడంతో ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-10-20T02:25:28+05:30

ఊహించని ఘటనలు జరగడం ద్వారా ఒక్కోసారి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతూ ఉంటాయి. భర్త లేదా భార్య కారణంగా తలెత్తే సమస్యలు చివరకు చాలా దూరం వెళ్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ కుటుంబంలో తల్లెత్తిన సమస్య చివరికి చిలికిచిలికి గాలివానలా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊహించని ఘటనలు జరగడం ద్వారా ఒక్కోసారి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతూ ఉంటాయి. భర్త లేదా భార్య కారణంగా తలెత్తే సమస్యలు చివరకు చాలా దూరం వెళ్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఓ కుటుంబంలో తల్లెత్తిన సమస్య చివరికి చిలికిచిలికి గాలివానలా మారింది. తన భర్త చేసిన పనిని.. భార్య జీర్ణించుకోలేకపోయింది. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది. వివరాల్లోకి వెళితే...


ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లా ఖిరియా గ్రామానికి చెందిన పరమేశ్వర్ పాతక్ కుమార్తె ప్రియాంకకు 2019లో రామానంద్‌ కుమారుడైన సుధీర్ త్రిపాఠితో వివాహమైంది. తర్వాత వారు ముంబైలో కాపురం పెట్టారు. సుధీర్ తల్లిదండ్రులు కూడా వాళ్లతో పాటే ఉండేవారు. భార్యాభర్తలు కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. అయితే తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒక్కోసారి రోజుల తరబడి ఇంటికి రాకపోవడం, చీటికీమాటికీ భార్యపై చికాకు పడడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెకు ఓ నిజం తెలిసింది. ఆమె భర్త.. పాయల్ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడని తెలిసి షాక్‌కు గురైంది. ఈ విషయమై కొన్ని నెలలుగా కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి.


రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో ప్రియాక.. ఇటీవల పుట్టింటికి వచ్చింది. కొన్నిరోజులుగా అక్కడే ఉంటోంది. కుమార్తెకు ధైర్యం చెప్పి.. వారి వద్దనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చిన వారు.. లోపల దృశ్యం చూసి షాక్ అయ్యారు. ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించడం చూసి బోరున విలపించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక భర్త సుధీర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-20T02:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising