ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్మాయిని ప్రేమించిన Auto Driver.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

ABN, First Publish Date - 2021-10-06T02:11:32+05:30

ఆసిఫ్(25) అనే వ్యక్తి ఆటోడ్రైవర్. 2018 నుంచి సోనియా అనే యువతితో స్నేహంగా ఉంటున్నాడు. రానురాను వారి మధ్య చనువు పెరిగింది. శారీరకంగా కూడా కలిశారు. అయితే ఇటీవల వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు.. ప్రేమ పేరుతో మోసపోతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం. అయితే మగవాళ్లంతా అలాగే ఉండరు. అదేవిధంగా ఆడవాళ్లంతా ఒకేలా ఉండరు.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అమ్మాయిని ప్రేమించిన ఆటో డ్రైవర్.. నిర్లక్ష్యంతో పరిస్థితి ఎంత వరకు తెచ్చుకున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఆసిఫ్(25) అనే వ్యక్తి ఆటోడ్రైవర్. 2018 నుంచి సోనియా అనే యువతితో స్నేహంగా ఉంటున్నాడు. రానురాను వారి మధ్య చనువు పెరిగింది. శారీరకంగా కూడా కలిశారు. అయితే ఇటీవల వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని సోనియా ఆసిఫ్‌ను కోరింది. అయితే ఈ విషయంలో ఆసిఫ్ నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలో ఓసారి సోనియా ఆసిఫ్‌ను కలవడానికి జలంధర్ నుంచి గురుగ్రామ్‌కు వెళ్లింది. తనతో పాటూ తన బావను కూడా తీసుకెళ్లింది. ఘటా అనే గ్రామ సమీపంలో అక్కడ ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది.


ఆగ్రహావేశానికి గురైన సోనియా, ఆమె బావా కలిసి ఆసిఫ్‌పై దాడి చేశారు. ఇనుప రాడ్, బండరాయితో కొట్టడంతో.. ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి గమనించి.. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులకు అక్కడకు చేరుకోనేసరికి నిందితులు పరారయ్యారు. ఆసిఫ్‌ను చికిత్స నిమిత్తం.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి స్వస్థలం యూపీలోని బుడున్ జిల్లాగా పోలీసులు తెలిపారు. అనంతరం మూడు గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-10-06T02:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising