ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసభ్యకర వీడియోతో సినీనటికి బెదిరింపులు

ABN, First Publish Date - 2021-02-22T12:50:24+05:30

తనపై అసభ్యకర వీడియోను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నగర శివారు ప్రాంతంలోని ఒక కాలేజీ యజమానిపై ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు నటి ఫిర్యాదు

చెన్నై/అడయార్(ఆంధ్రజ్యోతి): తనపై అసభ్యకర వీడియోను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడని నగర శివారు ప్రాంతంలోని ఒక కాలేజీ యజమానిపై ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను  అతడు, అతని అనుచరులు కొందరు హత్య చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారని  ఆమె ఆరోపించింది. అందువల్ల కాలేజీ యజమాని, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పుళల్‌ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  ఫిర్యాదు చేసిన ఆమె ఒక తమిళ చిత్రంలో నటించింది. ఆ కాలేజీ యజమాని ఒక సినిమా తీసేందుకు తనను సంప్రదించగా, తాను ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించానని, ఇదే విషయంపై అతనితో చర్చించేందుకు కార్యాలయానికి వెళ్ళగా, శీతలపానీయంలో మత్తు కలిసి ఇచ్చి, తనను అసభ్యంగా చిత్రీకరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.  ఈ క్రమంలో కాలేజీ యజమాని అనుచరులు తన ఇంటికి వచ్చి.. ఆయన చెప్పినట్టు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్లారని ఆమె పేర్కొంది. అలాగే, తనపై ఓ తప్పుడు కేసు కూడా పెట్టారని, ఈ కేసులో పుళల్‌ పోలీసుల ఎదుట హజరై తన వివరణ ఇచ్చానని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ యజమాని అనుచరులు ఇటీవల తన ఇంటికి వచ్చి తనను, తన తల్లిని దుర్భాషలాడుతూ హత్య చేస్తామని బెదిరించారని, అందువల్ల  ఆ కాలేజీ యజమాని, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరింది.

Updated Date - 2021-02-22T12:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising