ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంచీపురంలో చైన్ స్నాచర్ encounter

ABN, First Publish Date - 2021-10-13T16:01:03+05:30

మహిళ మెడలో బంగారు గొలుసును చోరీ చేసి పారిపోతూ కాల్పులు జరిపిన చైన్ స్నాచరును పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంచీపురం (తమిళనాడు): మహిళ మెడలో బంగారు గొలుసును చోరీ చేసి పారిపోతూ కాల్పులు జరిపిన చైన్ స్నాచరును పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం పట్టణంలో వెలుగుచూసింది.కాంచీపురంలో 55 ఏళ్ల మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును చైన్ స్నాచర్లు చోరీ చేసి పారిపోయారు. పారిపోయిన చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి మూడు డ్రోన్లతోపాటు పోలీసుబృందాలను రంగంలోకి దించారు. పారిపోయిన ఇద్దరు చైన్ స్నాచర్లు శ్రీపెరంబుదూర్ టోల్ ప్లాజా వద్ద ఉండగా ప్రజలు పట్టుకునేందుకు ప్రయత్నించారు.దీంతో చైన్ స్నాచర్లు గాలిలో కాల్పులు జరిపి ఇరుంగట్టు కొట్టె పొదల్లోకి పారిపోయారు.


 పొదల నుంచి ఓ నిందితుడు బయటకు రావడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. రెండవ చైన్ స్నాచరును పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా అతను కత్తితో పోలీసు హెడ్ కానిస్టేబుల్ చేతిని గాయపర్చాడు. దీంతో పోలీసు ఇన్ స్పెక్టరు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా చైన్ స్నాచర్ మరణించాడు. మరణించిన చైన్ స్నాచర్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మూర్తుజా అని పోలీసులు చెప్పారు. పోలీసులు నైన్ అక్తర్ అనే మరో చైన్ స్నాచరును అరెస్టు చేసి అతని వద్ద నుంచి కత్తులు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరు యువకులు కూలీ పనులు చేస్తూ చైన్ స్నాచింగులు చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Updated Date - 2021-10-13T16:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising