ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో ఘోర ఘటన : మృత్యువుతో పోరాడి ఓడిన సుమతి!

ABN, First Publish Date - 2021-01-19T14:24:59+05:30

అక్కను పెళ్లి చేసుకున్నా, మరదలిపై కన్నేశాడా దుర్మార్గుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరదలు దక్కదని నెల క్రితం పెట్రోలు పోసి నిప్పంటించిన బావ 


తిరుపతి : అక్కను పెళ్లి చేసుకున్నా, మరదలిపై కన్నేశాడా దుర్మార్గుడు. అల్లుడి దుర్భుద్దిని గమనించిన అత్తామామలు యువతికి పెళ్లి చేయాలని అనుకున్నారు. దీంతో ఆ నీచుడు మరదలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అప్పటి నుంచి రుయాస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న యువతి ఆదివారం రాత్రి మృతిచెందింది. వివరాలివీ.. ములకలచెరువు మండలం సోంపల్లె పంచాయతీ గట్టుకిందపల్లెకు చెందిన కదిరి శివన్న, నరసమ్మ దంపతులకు అరుణ, మాధవి, సుమతి కుమార్తెలున్నారు.


వీరిలో ఇద్దరికి వివాహం కాగా, మూడవ కుమార్తె సుమతి(24) మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. రెండో కుమార్తె మాధవిని కర్ణాటక రాష్ట్రం హొస్కోట సమీపంలోని బేగూరు చెందిన వెంకటేష్‌ (34) వివాహం చేసుకున్నాడు. భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మరదలు సుమతిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ఈ విషయం గుర్తించిన సుమతి తల్లిదండ్రులు మదనపల్లె మండలం జవకలపల్లెకు చెందిన యువకుడితో గత ఏడాది డిసెంబరు 25న ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి సొంతూరు వెళ్లిన వెంకటేష్‌ గతనెల 17వతేది తెల్లవారుజామున గట్టుకిందపల్లెకు వచ్చాడు. కుక్కలు అరవకుండా విషాహారం పెట్టడంతో రెండు కుక్కలు, ఓ పిల్లి, 30 కోళ్ళు మృతిచెందాయి.


అనంతరం ఇంటి వరండాలో నిద్రిస్తున్న సుమతిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో ఆమె కాపాడాలని కేకలు వేస్తూ అక్కడ పశువుల నీరు తాగే తొట్టెలోకి దూకింది. యువతి పరిస్ధితి విషమంగా మారడంతో కుటుంబీకులు బాధితురాలిని తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి యువతి మృత్యువుతో పోరాడుతున్న సుమతి ఆదివారం రాత్రి మృతిచెందింది. కాగా.. సంఘటన జరిగిన మరుసటి రోజు ములకలచెరువు సమీపంలోని తంబళ్లపల్లె వద్ద పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత యువతి మృతిచెందడంతో గట్టుకిందపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రుయాలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated Date - 2021-01-19T14:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising