ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంధువుల అమ్మాయితో మహిళలాగా చాట్ చేసి...

ABN, First Publish Date - 2021-04-09T18:14:53+05:30

ఆమె యాక్సెప్ట్‌ చేయగా, కొద్దిరోజులు మహిళలాగే స్నేహంగా చాటింగ్‌ చేశాడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : నగ్నచిత్రాలు పంపకపోతే.. ఫోన్‌ నంబర్‌ను ఆశ్లీల వెబ్‌సైట్లో పెడతానని వేధించిన నిందితుడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. పామర్తి సోమేంద్ర అలియాస్‌ సాయి పామర్రులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మహిళల నగ్న చిత్రాలు చూసే అలవాటు ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న స్నేహితుల జాబితాలో బంధువుల అమ్మాయి ప్రొఫైల్‌ చూసి ఆకర్షితుడయ్యాడు. మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా క్రియేట్‌ చేసి, ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపాడు. ఆమె యాక్సెప్ట్‌ చేయగా, కొద్దిరోజులు మహిళలాగే స్నేహంగా చాటింగ్‌ చేశాడు. 


తర్వాత ఆమె నగ్న చిత్రాలు పంపాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో, ఓ రోజు నగ్నంగా వీడియోకాల్‌ చేశాడు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్‌లు పంపాడు. తనతో నగ్నంగా వీడియోకాల్స్‌ మాట్లాడాలని, నగ్నచిత్రాలు పంపాలని వేధించాడు. చెప్పినట్లు ఆమె చేయకపోతే నీ ఫోన్‌ నంబర్‌ అశ్లీల సైట్లలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడి గుర్తించగా, అతడు ఆమెకు బంధువు అని తెలిసింది. నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-04-09T18:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising