ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోన్న ఓ హెచ్చరిక బోర్డు.. అదేంటో మీరూ చూసేయండి..!

ABN, First Publish Date - 2021-09-30T18:17:04+05:30

రోడ్లపై ప్రమాదాలు నియంత్రించడం కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్యాల(నల్గొండ): రోడ్లపై ప్రమాదాలు నియంత్రించడం కోసం పోలీసులు అనేక హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అక్కడక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మామూలుగా అయితే.. ‘‘వేగం కన్నా.. ప్రాణం మిన్నా..’’, ‘‘చూసుకుని.. నిదానంగా వెళ్లండి’’ అని బారిగేట్‌లపై రాయిస్తుంటారు. కానీ ఓ బారిగేట్‌పై రాసి ఉన్నది చూసి అందరూ నవ్వుకుంటున్నారు.. అదేంటంటే..



నల్గొండ జిల్లా చిట్యాలలోని హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఓ బారిగేట్‌ను ఏర్పాటు చేశారు. దానిపై ‘‘స్త్రీలను కాదు.. బండి రోడ్డువైపు చూసి నడుపు’’అని రాసి ఉంది. ఈ వినూత్న హెచ్చరికను చూసిన వాహనదారులు నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఈ బారిగేట్‌ను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టడమే కాకుండా... ఇలా రాయించిన పోలీసులను మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2021-09-30T18:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising