ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SI హత్యకేసులో ఇద్దరు బాలురు సహా ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2021-11-23T16:05:45+05:30

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన తిరుచ్చి జిల్లా నవాల్‌పట్టు ప్రత్యేక ఎస్‌ఐ భూమినాతిథన్‌ (51) హత్య కేసులో తంజావూరు, పుదుకోటకు చెందిన 10, 17 యేళ్ల వయసున్న ఇద్దరు బాలురు సహా ముగ్గురిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన తిరుచ్చి జిల్లా నవాల్‌పట్టు ప్రత్యేక ఎస్‌ఐ భూమినాతిథన్‌ (51) హత్య కేసులో తంజావూరు, పుదుకోటకు చెందిన 10, 17 యేళ్ల వయసున్న ఇద్దరు బాలురు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోపే హంతకులు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. వారిని రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి డీఐజీ శరవణ సుందర్‌ ఆదేశం మేరకు హంతకులను పట్టుకునేందుకు తిరుచ్చి సర్కిల్‌లో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు, పుదుకోట సర్కిల్‌లో నాలుగు ప్రత్యేక బృందాలు చొప్పున మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. రెండు జిల్లాల్లో మేక లను దొంగిలించే పాత నేరస్థుల వద్ద ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారణ జరిపారు. ఆ విచారణలో పుదుకోటకు చెందిన కొందరు యువకులు ఆ ప్రాంతంలో మేకలను దొంగిలించేవారని తెలిసింది.


సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అరెస్టు

ఎస్‌ఐ భూమినాథన్‌ హత్యకేసులో ప్రత్యేక బృందం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా హంతకులు ఏ ప్రాంతానికి చెందినవారనే విషయాన్ని గుర్తించారు. మేకల దొంగలను ఆయన నిర్బంధించి, తన సహచరుడైన మరో ఎస్‌ఐ శేఖర్‌కు సెల్‌ఫోన్‌ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ సమయంలో ఎస్‌ఐ భూమినాథన్‌కు చేరువగా దొంగల ఇరువురి వద్దనున్న రెండు సెల్‌ఫోన్ల నుంచి సిగ్నల్స్‌ వచ్చాయి. ఈ సిగ్నల్స్‌ను ప్రత్యేక దళం పోలీసులు ట్రేస్‌ చేయగా ఆ రెండు సెల్‌ఫోన్లు తంజావూరు జిల్లా కల్లనై సమీపం దోకూరు ప్రాంతానికి చెందిన వారిదని గుర్తించారు. ఆ మేరకు ఆ సెల్‌ఫోన్లు పుదుకోట జిల్లా అరిమలం సమీపం తేనీర్‌పట్టి వద్ద పనిచేస్తున్నాయని నిర్ధారించుకుని ఆ సమాచారం అందించి ప్రత్యేకబృందం పోలీసులను అక్కడికి వెళ్ళి నిందితులను అరెస్టు చేయమని ఆదేశించారు. ఆ తర్వాత పోలీసులు సోమవారం వేకువజామున అక్కడికి వెళ్లి దోకూరుకు చెందిన మణికంఠన్‌ (19), పుదుకోట అన్నాపట్టికి చెందిన ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు, అమరేంద్రపురానికి చెదిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 యేళ్ల బాలుడిని అరెస్టు చేశారు. వీరి నుండి ఓ బైకు, మేకలను నరికే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-11-23T16:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising