ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో కరడు కట్టిన నేరగాడిపై పోలీసుల కాల్పులు...అరెస్ట్

ABN, First Publish Date - 2021-03-02T12:52:08+05:30

పలు అత్యాచారం కేసుల్లో నిందితుడైన సీరియల్ రేపిస్టు, కరడు కట్టిన నేరగాడిని నోయిడా పోలీసులు కాల్పుల అనంతరం అరెస్టు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నోయిడా : పలు అత్యాచారం కేసుల్లో నిందితుడైన సీరియల్ రేపిస్టు, కరడు కట్టిన నేరగాడిని నోయిడా పోలీసులు కాల్పుల అనంతరం అరెస్టు చేశారు. వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు సోమవారం రాత్రి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తుండగా గ్రేటర్ నోయిడా అథారిటీ కార్యాలయం సమీపంలో కనిపించాడు.నిందితుడు కంట్రీమేడ్ పిస్టల్ తో కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నేరగాడి కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో కరడుకట్టిన నేరగాడిని పోలీసులు అరెస్టు చేసి, అతన్ని చికిత్స చేయించేందుకు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నలుగురు మహిళలపై అత్యాచారం చేశాడు. దొంగతనాలు, దోపిడీలు చేసిన నిందితుడు 2019లో అరెస్టు అయి జైలుకు వెళ్లి ఫిబ్రవరి నెలలో బెయిలుపై విడుదలయ్యాడు. బెయిలుపై వచ్చిన నిందితుడు నలుగురు మహిళలపై వరుస అత్యాచారాలు చేశాడని డీసీపీ బృందశుక్లా చెప్పారు.ఒంటరిగా ఉన్న మహిళలను పొదల్లోకి లాక్కెళ్లి వారిపై అత్యాచారాలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.పోలీసులు నేరగాడి నుంచి తుపాకీతోపాటు తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-03-02T12:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising