ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూలు కరస్పాండెంట్‌కు రిమాండ్‌

ABN, First Publish Date - 2021-12-19T16:08:45+05:30

తిరునల్వేలి నగరంలో ప్రైవేటు పాఠశాల మరుగుదొడ్డి ప్రహరీగోడ కూలిపడి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటనకు సంబంధించిన ఆ స్కూలు కరస్పాండెంట్‌, హెడ్మాస్టర్‌, గోడను నిర్మించిన కాంట్రాక్టర్‌ను పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తిరునల్వేలి నగరంలో ప్రైవేటు పాఠశాల మరుగుదొడ్డి ప్రహరీగోడ కూలిపడి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటనకు సంబంధించిన ఆ స్కూలు కరస్పాండెంట్‌, హెడ్మాస్టర్‌, గోడను నిర్మించిన కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. గాయపడిన నలుగురు విద్యార్థులకు తలా రూ.3లక్షల సాయాన్ని ప్రకటించారు. ఈ నగదును స్పీకర్‌ అప్పావు, మంత్రి రాజ కన్నప్పన్‌ గాయపడిన నలుగురు విద్యార్థుల కుటుంబీకులకు అందజేశారు. ఈ నేపథ్యంలో గోడకూలిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూలు కరస్పాండెంట్‌ సెల్వకుమార్‌, హెడ్మాస్టర్‌ జ్ఞానసెల్వి, కట్టడ కాంట్ర్టార్‌ జాన్‌  కెన్నడీని అరెస్టు చేశారు. వీరిలో సెల్వకుమార్‌, జాన్‌కెనడీలను ఈనెల 21 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇరువురిని పోలీసులు జైలుకు తరలించారు.

Updated Date - 2021-12-19T16:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising