ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్స్‌ వైద్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN, First Publish Date - 2021-04-18T14:47:53+05:30

డబ్బులు తీసుకొని, శస్త్రచికిత్స చేయలేదని.. ఇదేమని అడిగినందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : డబ్బులు తీసుకొని, శస్త్రచికిత్స చేయలేదని.. ఇదేమని అడిగినందుకు ఈఎన్‌టీ వైద్యుడు తనను కులం పేరుతో దూషించి దాడి చేశాడని ఓ బాధితుడు పంజాగుట్ట పోలీసులకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. యూసఫ్‌గూడ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన వెంకటేష్‌ అనారోగ్యంతో నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని ఎండోస్కొపీ సాయంతో శస్త్రచికిత్స చేయాలని సూచించారు. అందుకు ఓ ప్రైవేటు ఈఎన్‌టీ వైద్యుడికి కొంత మొత్తాన్ని వెంకటేష్‌ ఇచ్చాడు. తీరా ఆపరేషన్‌ సమయానికి ప్రైవేటు వైద్యుడు రాకపోవడంతో నిమ్స్‌ వైద్యులు ఆపరేషన్‌ నిలిపివేశారు. ఇదేమని ప్రశ్నించిన తనపై ఓ ఈఎన్‌టీ వైద్యుడు కులం పేరుతో దూషించి దాడి చేశాడని నాలుగురోజుల క్రితం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసును నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం  నిమ్స్‌ ఈఎన్‌టీ వైద్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-04-18T14:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising