ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో ‘రావణ్‌ సామ్రాజ్య’ గ్యాంగ్‌ ఆటకట్టు

ABN, First Publish Date - 2021-03-27T12:02:55+05:30

కేవలం 22 ఏళ్లకే క్రిమినల్స్‌గా తయారయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇద్దరు నిందితుల అరెస్టు
  • రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌ : కేవలం 22 ఏళ్లకే క్రిమినల్స్‌గా తయారయ్యారు. పుణెకు చెందిన ఓ గ్యాంగ్‌లో చేరారు. తర్వాత అనేక నేరాలు చేసి మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు నేరేడ్‌మెట్‌లో కమిషనరేట్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 


పుణె నగరంలోని గణే్‌షనగర్‌ పెనిపిరిచించోడి ప్రాంతానికి చెందిన నందకిషోర్‌ అలియాస్‌ మనోజ్‌ పదో తరగతి వరకు చదివాడు. అతడి స్నేహితుడు రోహన్‌ రాజీవ్‌ చండాలియా ఇంటర్‌ చదివి ఆపేశాడు. ఇద్దరూ కలిసి పోకిరీగా తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకునేవారు. వారికి పుణెలో జాదవ్‌ బస్తీకి చెందిన పేరు మోసిన గ్యాంగ్‌ ‘రావణ్‌ సామ్రాజ్య’తో పరిచయం ఏర్పడింది. ఆ గ్యాంగ్‌ లీడర్‌ అనికేత్‌ బహరా జాదవ్‌ వారిని పనిలో పెట్టుకున్నాడు. దీంతో వారు 22 ఏళ్లకే క్రిమినల్స్‌గా మారిపోయారు. రావణ్‌ సామ్రాజ్య గ్యాంగ్‌లో చేరిన తర్వాత మహారాష్ట్రలోని వివిధ పోలీ్‌సస్టేషన్‌లలో నందకిషోర్‌పై 9, రోహన్‌పై 5 కేసులు నమోదయ్యాయి. పలుసార్లు అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చారు. పోలీసులు వారిని మోకా చట్టం కింద ఆర్గనైజ్డ్‌ క్రిమినల్స్‌ జాబితాలో చేర్చారు. 


తుపాకులు కొనుగోలు

రావణ్‌ సామ్రాజ్య గ్యాంగ్‌లో పనిచేస్తున్న వీరికి వారి ప్రత్యర్థి గ్యాంగ్‌ అయిన వివేక్‌ ముఠాతో విభేదాలు వచ్చాయి. ఆ ముఠా నుంచి ఇద్దరు క్రిమినల్స్‌కు ప్రాణహాని ఏర్పడింది. తమను రక్షించుకోవాలని భావించిన నిందితులు రెండు తుపాకులు కొనుగోలు చేశారు. ప్రత్యర్థి గ్యాంగ్‌ నుంచి రోజు రోజుకు ప్రాణహాని హెచ్చరికలు పెరిగిపోవడంతో ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని నిర్ణయించుకున్నారు.


నగరంలో షెల్టర్‌కోసం వచ్చి.. 

రెండు రోజుల క్రితం రైల్లో పుణె నుంచి హైదరాబాద్‌ వచ్చిన నిందితులు ఎల్‌బీనగర్‌ పరిధిలో షెల్టర్‌ కోసం తిరుగుతున్నారు. పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు తుపాకులు, నాలుగు లైవ్‌ రౌండ్స్‌ బుల్లెట్స్‌ దొరికాయి. పోలీసులు కేసు నమో దు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. 


క్రిమినల్స్‌ నేరచరిత్ర తెలుసుకోవాలి 

నగరంలో ఇలాంటి క్రిమినల్స్‌ ఉన్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. షెల్టర్‌ ఇచ్చే ముందు ఇంటి యజమానులు వారి నేరచరిత్ర గురించి ఆరా తీయాలి. - సుధీర్‌బాబు, అడిషనల్‌ సీపీ, రాచకొండ.

Updated Date - 2021-03-27T12:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising