ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్ కుటుంబంలో దారుణం! కోడలిపై మామ అత్యాచారం! విషయం భర్తకు తెలిసి..

ABN, First Publish Date - 2021-06-27T20:27:12+05:30

కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళపై అదే శాఖలో పనిచేస్తున్న ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణం గురించి భర్తకు చెబితే..అతడు అదే కారణం చెప్పి నిషేధిత త్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్ కుటుంబంలో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళపై అదే శాఖలో పనిచేస్తున్న ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణం గురించి భర్తకు చెబితే..అతడు అదే కారణం చెప్పి నిషేధిత త్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడు. మీరట్ జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. బాధితురాలు మీరట్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త అబిద్ కూడా ఓ పోలీస్ అధికారి కాగా.. అతడి తండ్రి అయిన నజీర్ అహ్మద్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.  అత్యాచారం గురించి ఎవరీకైనా చెబితే చంపేస్తానంటూ మామ బెదిరించాడని, సాయం కోసం భర్తను ఆశ్రయిస్తే అతడు తనకు త్రిపుల్ తలాఖ్ ఇచ్చేశాడని ఆమె ఆరోపించింది. దీంతో.. నిందితుడు నజీర్‌పైనా, బాధితురాలి భర్త అబీద్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబీద్‌తో తనకు మూడేళ్ల క్రితం వివాహమైందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టి నాటి నుంచీ అత్తింటివారు తనను అదనపు కట్నం కోసం వేధించేవారిని ఆమె పేర్కొంది.

Updated Date - 2021-06-27T20:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising