ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోదరుడు అత్యాచారం చేశాడని తండ్రికి చెప్పగా.. అతడు చేసిన పనికి ఖంగుతిన్న 16ఏళ్ల యువతి!

ABN, First Publish Date - 2021-09-30T14:03:43+05:30

ఈ మధ్యకాలంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌(రాజస్థాన్‌): ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వావి వరసలు మరిచి సొంత అక్క, చెల్లెలిపైనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. సోదరుడే అత్యాచారం చేశాడని చెబితే.. తండ్రి అతడిపై చర్యలు తీసుకోకుండా ఆ అమ్మాయికే షాకిచ్చిడు. ఆ విషయమేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది.


జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఒక కొడుకు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఓ అమ్మాయి పుట్టింది. రెండో భార్య కూడా కొన్నాళ్లకు మరణించింది. రెండో భార్య చనిపోయినప్పటి నుంచి మొదటి భార్య కొడుకు ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తునే ఉన్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేక ఓ రోజు తండ్రికి జరిగిన దారుణం గురించి వివరించింది. సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడనుకుని ఆ అమ్మాయి భావించింది. కానీ అక్కడే ఓ షాకింగ్ ఘటనకు ఎదురైంది. ఆ అమ్మాయిని కొట్టడమే కాకుండా బయటకు గెంటేశాడు. తండ్రి చేసిన పనికి కూతురు ఖంగుతింది. 



చేసేదేమి లేక వాళ్ల మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. అతడి సహాయంతో 2017, అక్టోబర్ 27న ఫాగీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతికి 16ఏళ్లు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు వచ్చింది. వావివరసలు మరిచి చెల్లెలిపైనే అత్యాచారం చేసిన నిందితుడిపై కోర్టు కఠిన శిక్షను విధించింది. జీవితాంతం జైలులోనే ఉండాలని తీర్పునిచ్చింది. అలాగే మూడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సందీప్ కుమార్ తీర్పును వెల్లడించారు. 

Updated Date - 2021-09-30T14:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising