ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యనుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. లాయర్‌కు పెన్‌డ్రైవ్‌ ఇచ్చిన మాజీ భర్త.. అందులో ఉన్న వీడియోలు చూసి కంగుతిన్న మహిళ!

ABN, First Publish Date - 2021-10-06T17:55:33+05:30

భార్యభర్తల మధ్య గొడవలు తీవ్రం కావడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్‌డెస్క్: భార్యభర్తల మధ్య గొడవలు తీవ్రం కావడంతో విడాకులు తీసుకున్నారు. భార్యపై కోపం తగ్గని భర్త.. ఆమెను చంపేస్తానని కోర్టు ప్రాంగణలోనే బెదిరించాడు. అంతటితో ఆగకుండా పోతూపోతూ భార్య తరపున న్యాయవాదికి ఓ పెన్‌డ్రైవ్ ఇచ్చాడు. దాంట్లో ఏముందోనని చూడగా.. అందులో ఉన్న వీడియోలు చూసి ఆమెకు గుండె ఆగినంతపనైంది. వివరాల్లోకి వెళ్తే..


రాజస్థాన్‌లోని భద్ర నగరానికి చెందిన రాకేష్ అనే వ్యక్తికి 2019లో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజుల వరకు బాగానే ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి విడాకులు తీసుకోవాలనుకున్నారు. హిస్సార్ కోర్టులో విడాకులు కావాలని పిటిషన్ వేసి.. సెప్టెంబర్‌లో విడాకులు పొందారు. భార్యపై కోపం పెంచుకున్న రాకేష్.. తన భార్యను, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని కోర్టు ప్రాంగణంలోనే బెదిరించాడు. రాకేష్ ఇంటికి వెళ్లేముందు భార్య తరపున న్యాయవాదికి ఓ పెన్‌డ్రైవ్ ఇచ్చాడు. అందులో ఏముందోనని చూడగా.. భార్యకు షాకింగ్ వీడియోలు కనిపించాయి.



హనీమూన్‌కు వెళ్లిన సందర్భంలో రాకేష్ తన భార్యకు తెలియకుండా కొన్ని వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ వీడియోలు, ఫొటోలు వారి మొదటిరాత్రికి సంబంధించినవి. చంపుతానని బెదిరించడంతోపాటు ఆమె అనుమతి తీసుకోకుండా తీసిన వీడియోల గురించి.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-10-06T17:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising