ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దె డబ్బులు అడ్వాన్స్‌ ఇస్తానని.. QR Code పంపమన్నారు.. స్కాన్ చేస్తే..!

ABN, First Publish Date - 2021-08-08T14:52:09+05:30

అద్దె డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తానని నమ్మించి ఉన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : అద్దె డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తానని నమ్మించి ఉన్న డబ్బులు దోచేసిన ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సబిన్‌ మహరాజ్‌ వింగ్‌ కమాండర్‌గా రిటైర్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌లో ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తమఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాడు. విషయం తెలుసుకున్న గుర్తుతెలియని వ్యక్తి ఇల్లును అద్దెకు తీసుకుంటానని ఫోన్‌ చేశాడు. అడ్వాన్స్‌గా అద్దె డబ్బులు చెల్లిస్తానని చెప్పి క్యూఆర్‌ కోడ్‌ పంపాడు. దాన్ని స్కాన్‌ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు. ఆ తర్వాత బాధితుడి ఖాతాలోంచి రూ. 35వేలు కట్‌ అయ్యాయి. టెక్నికల్‌ ఎర్రర్‌ వల్ల జరిగిందని చెప్పి, మరో క్యూఆర్‌ కోడ్‌ పంపాడు. ఈ సారి కూడా మరో రూ. 35వేలు కట్‌ అయ్యాయి. మోసపోయానని గుర్తించిన బాధితుడు రాజేంద్రనగర్‌ సైబర్‌ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-08T14:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising