ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమృతసర్‌లో ఆయుధ స్మగ్లర్ అరెస్ట్...48 విదేశీ పిస్టళ్ల స్వాధీనం

ABN, First Publish Date - 2021-06-12T12:56:00+05:30

ఖలిస్థాన్ ఉగ్రవాదుల కోసం విదేశీ పిస్టళ్లను స్మగ్లింగ్ చేసిన ఆయుధ స్మగ్లర్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ (పంజాబ్): ఖలిస్థాన్ ఉగ్రవాదుల కోసం విదేశీ పిస్టళ్లను స్మగ్లింగ్ చేసిన ఆయుధ స్మగ్లర్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లోని కథునంగల్ సమీపంలో బటాలా జిల్లా నివాసి జగ్జిత్ సింగ్ (25) ను పంజాబ్ అంతర్గత భద్రతా విభాగం అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి రెండు నైలాన్ సంచుల్లో 48 విదేశీ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటలీ, చైనా, టర్కీ దేశాల్లో తయారైన అధునాతన పిస్టళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పంజాబ్ డీజీపీ దింకర్ గుప్తా చెప్పారు. ప్రస్థుతం అమెరికాలో ఉన్న మాజీ గ్యాంగ్ స్టర్ డర్మాన్ పిస్టళ్లను జగ్జిత్ సింగ్ కు పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థలతో అమెరికా, కెనడా, యూకే కేంద్రంగా ఉన్న ఖలిస్థానీ అనుకూలవాదులు విదేశీ పిస్టళ్లను పంజాబ్ స్మగ్లరుకు పంపించారని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పిస్టళ్లు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడానికి రప్పించారని డీజీపీ గుప్తా వివరించారు.


Updated Date - 2021-06-12T12:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising