ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైట్ కర్ఫ్యూలో హోటల్ బంద్ చేయాలన్న పోలీసుపై మరుగుతున్న టీ పోసి...

ABN, First Publish Date - 2021-04-05T17:39:53+05:30

మధ్యప్రదేశ్‌లోని కంజీక్యాంప్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కంజీక్యాంప్‌లో ఒక హోటల్ యజమాని పోలీసులపై దాడికి దిగిన ఉదంతం వెలుగు చూసింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాత్రివేళ కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో హోటల్ బంద్ చేయమని చెప్పిన ఓ పోలీసుపై ఆ హోటల్ యజమాని దాడి చేశాడు. హోటల్ యజమాని కుమారుడు ఆ కానిస్టేబుల్‌పై మరుగుతున్న టీ పోశాడు. తరువాత ఆ హోటల్ యజమాని కుటుంబ సభ్యులు పోలీసుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు. 


హనుమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ హెడ్ మహేంద్ర సింగ్ ఠాకుర్ తెలిపిన వివరాల ప్రకారం కరోనా కట్టడి కోసం పట్టణంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉందన్నారు. అయితే జహీర్ ఖాన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన హోటల్ తెరిచివుంచాడని, వినియోగదారులు అక్కడికి వస్తున్నారన్నారు. అయితే దీనిని గమనించిన పోలీసులు హోటల్ బంద్ చేయాలని కోరారు. దీంతో అతను దుకాణం షట్టర్ కిందకు దించాడు. అయితే కొద్దిసేపటి తరువాత తిరిగి దుకాణం తెరిచాడు. దీనికి గమనించిన ఎఎస్ఐ జాట్... జహీర్ ఖాన్‌తో హోటల్ బంద్ చేయాలని చెప్పాడు.  అయితే అక్కడే ఉన్న జహీర్ ఖాన్ కుమారుడు ఆ పోలీసుపై మరుగుతున్న టీ పోశాడు. తరువాత జహీర్ ఖాన్ కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-05T17:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising