ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారణ కోసం కోర్టుకు తీసుకువచ్చిన నిందితుడు పరార్.. దీని వెనుక ఎవరి హస్తముందో తెలిస్తే షాకవుతారు..

ABN, First Publish Date - 2021-11-21T17:15:10+05:30

నెల్లాళ్ల క్రితం రాయపూర్(ఛత్తీస్‌గఢ్) కోర్టు నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లాళ్ల క్రితం రాయపూర్(ఛత్తీస్‌గఢ్) కోర్టు నుంచి ఒక ఖైదీ పరారయ్యాడు. దీనికి వెనుక పోలీసు కానిస్టేబుల్ ప్లానింగ్ ఉందని వెల్లడయ్యింది. రాయపూర్‌కు చెందిన కానిస్టేబుల్ ఒక ఖైదీ తప్పించుకుని పారిపోయేందుకు సహకారం అందించాడు. పోలీసుల దర్మాప్తులో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ ఉదంతంలో కానిస్టేబుల్‌ రావేంద్ర ప్రసాద్ పటేల్‌పై కేసు కూడా నమోదు చేశారు. రాయపూర్ ఎస్పీ ఈ కేసును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. 


సదరు కానిస్టేబుల్‌ను పిలిచి మందలించినట్టు సమాచారం. ప్రస్తుతం అతనిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం ఈ కానిస్టేబుల్ ఒక హత్య కేసులో బీహార్‌కు చెందిన నిందితుడు అనుపమ్ ఝాను కోర్టు ప్రాంగణానికి తీసుకు వచ్చాడు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టకముందే అతను పారిపోయాడు. ఈ నేపధ్యంలో కానిస్టేబుల్ రావేంద్రను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఇప్పటివరకూ వెల్లడయిన వివరాల ప్రకారం హంతకునికి జైలు నుంచి విముక్తి కల్పించేందుకు వారి కుటుంబీకులతో కానిస్టేబుల్ రావేంద్ర ప్రసాద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు హంతకుడు కోర్టు ప్రాంగణం నుంచి తప్పించుకునేందుకు సహకరించాడు. అనుకున్న విధంగా హంతకుడు పరారైన వెంటనే కానిస్టేబుల్ రావేంద్ర.. పోలీస్ స్టేషన్‌లో సదరు ఖైదీపై కేసు నమోదు చేయించాడు. ఈ విషయం వెలుగులోకి రాగానే పోలీసుశాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి.

Updated Date - 2021-11-21T17:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising