ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోన్‌యాప్‌లతో రూ.300 కోట్ల మోసం

ABN, First Publish Date - 2021-01-09T13:41:54+05:30

ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ల ద్వారా రుణాలిచ్చి కందువడ్డీ వేధింపులతో అమాయక ప్రజలను మోసగించిన కేసులో అరెస్టైన ఇద్దరు చైనీయుల వద్ద సెంట్రల్‌ క్రైం విభాగ పోలీసులు ముమ్మరంగా విచా రణ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనువాదకుల సాయంతో చైనీయుల వద్ద విచారణ

చెన్నై: ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ల ద్వారా రుణాలిచ్చి కందువడ్డీ వేధింపులతో అమాయక ప్రజలను మోసగించిన కేసులో అరెస్టైన ఇద్దరు చైనీయుల వద్ద సెంట్రల్‌ క్రైం విభాగ పోలీసులు ముమ్మరంగా విచా రణ జరుపుతున్నారు. కోర్టు ఆదేశాల మేర కు ఇద్దరిని ఆరు రోజుల కస్టడీకి తీసు కున్నారు. బెంగళూరు కేంద్రంగా ఇద్దరు చైనా ఏజెంట్లు, మరో ఇద్దరు కలిసి కాల్‌సెంటర్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ లోన్‌యాప్‌ల ద్వారా రూ.5,000 రుణా నికి వారానికి రూ.1500 చొప్పున వడ్డీ వసూలు చేశారు.  రెండు నెలల వ్యవధిలో వీరు అసలు కంటే వడ్డీలే అధికంగా వసూలు చేసి రూ.300 కోట్ల దాకా ఆర్జించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చెన్నై సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు ఇటీవల బెంగళూరుకు వెళ్లి లోన్‌యాప్‌లను నడిపే కాల్‌సెంటర్‌లో తనిఖీలు జరిపి అక్కడ పనిచేస్తున్న చైనా ఏజెంట్లు సియావ్‌ యంగ్‌మావ్‌, ఊయుమెన్‌ వన్‌ను వారికి సహకరిస్తున్న ప్రమోదా, సీఆర్‌ పవన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో చైనా దేశస్థులను సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు ఇద్దరు అనువాదకుల సాయంతో  విచారణను కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-01-09T13:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising