ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోయ పూజారులు.. రూ.21 లక్షలు దోచేశారు!

ABN, First Publish Date - 2021-03-07T17:53:05+05:30

లక్షలు ఇస్తే కోట్లాది రూపాయల గుప్త నిధులను వెలికితీస్తామని నమ్మబలికారు. ఇంట్లో గుప్తనిధులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్ జిల్లా: లక్షలు ఇస్తే కోట్లాది రూపాయల గుప్త నిధులను వెలికితీస్తామని నమ్మబలికారు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ.. అమాయక మహిళను ముగ్గురు కోయపూజారులు నిండా ముంచేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరులో చోటు చేసుకుంది. ఇటీవల గ్రామానికి వచ్చిన కోయపూజారి.. గుప్తనిధుల పేరుతో మహిళను నమ్మించాడు. ఇంటిలో ఓ మూలన రెండు మీటర్ల లోతులో నిధులున్నాయని చెప్పాడు. తొమ్మిది రోజుల్లో తీస్తానంటూ... విడతల వారీగా 5 లక్షలు తీసుకున్నాడు. అయితే పెద్ద శక్తులు ఉన్నాయని మరో కోయ పూజారిని తీసుకు వచ్చాడు. ఈ సారి మరో మూడు లక్షలు తీసుకున్నారు. అయితే ఏ మాయచేశారో కానీ... ఓ రాగి బిందెను బయటకు తీసినట్టు బిల్డప్ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబం నమ్మడం మొదలుపెట్టింది. అయితే కేరళ నుంచి పెద్ద సాములోరు వస్తారని చెప్పగా... నిజమేననుకుంది. ఈ సారి మరికొంత ఇచ్చారు. ఇలా మూడు విడతల్లో మొత్తం 21 లక్షలు ముట్ట చెప్పారు. చివరకు చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు కుటుంబం.  

Updated Date - 2021-03-07T17:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising