ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: బాలికపై లైంగిక దాడి

ABN, First Publish Date - 2021-10-24T13:01:06+05:30

నగర శివారు ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టు


అడయార్‌(Tamilnadu): నగర శివారు ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 16 ఏళ్ళ బాలిక ఈ నెల 18వ తేదీన వీధిలో ఉన్న ఓ దుకాణానికి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎక్కడ గాలించినా కనిపించపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో 28 ఏళ్ళ వయస్సున్న విజయకుమార్‌ అనే యువకుడు ఈ బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తన వెంట తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి, బాలికను రక్షించారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 


Updated Date - 2021-10-24T13:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising