ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 20ల దొంగతనం.. మూడేళ్ల జైలు శిక్ష!

ABN, First Publish Date - 2021-06-14T20:20:01+05:30

మహారాష్ట్రా రాజధాని ముంబైకి చెందిన 26 ఏళ్ల కార్మికుడికి బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు తాజాగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి నుంచి రూ. 20ల దొంగిలించిన ఘటనకు సంబంధించిన కేసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రా రాజధాని ముంబైకి చెందిన 26 ఏళ్ల కార్మికుడికి బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు తాజాగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి నుంచి రూ. 20ల దొంగిలించిన ఘటనకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా..నిందుతుడు తన నేరాన్ని అంగీకరించాడు. అయితే..దొంగతనం చేసే సమయంలో నిందితుడితో జరిగిన ఘర్షణ కారణంగా బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడని పేర్కొన్న న్యాయస్థానం.. నిందితుడికి మూడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా.. నిందితుడు అర్జున్ గైక్వాడ్ ఏడునెలల నుంచి జుడిషియల్ కస్టడీలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు నేరం చేసినట్టు అంగీకరిస్తూ మార్చి నెలలో న్యాయస్థానానికి ఓ లేఖ ద్వారా తెలియజేశాడు. ఇక.. అతడు స్వచ్ఛందంగా నేరం అంగీరించినట్టు కోర్టు భావిస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే అతడు ఏడునెలలకు పైగా జైలు జీవితం గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ జడ్జి నిందితుడికి మూడేళ్ల శిక్ష విధించింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. దోపిడీ సమయంలో బాధితుడు గాయపడినట్టైతే నిందితుడికి గరిష్టంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించొచ్చు.

Updated Date - 2021-06-14T20:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising