ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హత్య ఎలా చేయాలి’ అంటూ గూగుల్‌లో వెతికి ఆపై..

ABN, First Publish Date - 2021-06-21T05:11:39+05:30

ప్రియుడి సాయంతో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. హత్య ఎలా చేయాలి..మృత దేహాన్ని ఎలా వదిలించుకోవాలి అని గూగుల్ సెర్చ్‌లో వెతికి పక్కా ప్రణాళిక రచించాక ఈ దారుణానికి ఒడిగట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్దా(మధ్యప్రదేశ్): ప్రియుడి సాయంతో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. హత్య ఎలా చేయాలి..మృత దేహాన్ని ఎలా వదిలించుకోవాలి అని గూగుల్ సెర్చ్‌లో వెతికి పక్కా ప్రణాళిక రచించాక ఈ దారుణానికి ఒడిగట్టింది. మధ్యప్రదేశ్‌లో హర్దా జిల్లాలోగల ఖేదీపూర్ ప్రాంతంలో జూన్ 18 ఈ దారుణం జరిగింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. నిందితురాలు తబుస్సుమ్ స్యయంగా భర్త మరణం గురించి పోలీసులు దృష్టికి తెచ్చింది. కానీ..ఈ దారుణం ఎలా జరిగిందో తనకు తెలీదంటూ  పోలీసులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. అయితే.. నిందితురాలికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నదని దర్యాప్తులో తేలడంతో చిక్కుముడి వీడిపోయింది. 


పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రంలో పనిచేసే ఆమె భర్త ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఉండటంతో తబుస్సుమ్‌కు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో అతడిని అడ్డుతొలగించుకునేందుకు ఆమె ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. బాధితుడికి ఆస్తమా ఉన్న విషయాన్ని ఆసరా చేసుకుని అతడికి వేరే ఔషధం ఇవ్వడంతో అతడు స్పృహ తప్పిపోయాడు. ఆ తరువాత ప్రియుడు వచ్చి అతడి తలపై సుత్తితో మోది హత్య చేశాడు. అనంతరం.. నిందితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఇంటిని దోచుకునే క్రమంలో నిందితులు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. అయితే.. తబుస్సుమ్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో వారు సైబర్ సెల్ సహాయం తీసుకోగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో..వారు భార్యను ఆమె ప్రియుడిని హత్యానేరంపై అరెస్టు చేశారు. 

Updated Date - 2021-06-21T05:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising