ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్‌జీ గేమ్ గురించి గొడవ.. 13ఏళ్ల పిల్లాడి హత్య!

ABN, First Publish Date - 2021-04-05T11:54:44+05:30

దేశంలో పబ్‌జీ గేమ్ బ్యాన్ చేసినప్పటికీ కొందరు ఏదో రకంగా దాన్ని ఆడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ గేమ్ గురించి గొడవ పడినందుకు ఓ 13ఏళ్ల బాలుడి హత్య జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశంలో పబ్‌జీ గేమ్ బ్యాన్ చేసినప్పటికీ కొందరు ఏదో రకంగా దాన్ని ఆడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ గేమ్ గురించి గొడవ పడినందుకు ఓ 13ఏళ్ల బాలుడి హత్య జరిగింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఒక మైనర్ బాలుడిని పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. తను గేమ్ ఆడకుండా వేరే వ్యక్తితో గేమ్ ఆడించి గెలిచాడనే అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు విచారణలో నిందితుడు చెప్పాడు. అకీఫ్ అనే 13 ఏళ్ల కుర్రాడు మరో మైనర్ బాలుడితో పబ్‌జీ ఆడాడు. వీళ్లిద్దరూ సవాలు చేసుకొని గేమ్ ఆడుకున్నారు. అకీఫ్‌తో ఆడిన కుర్రాడు ఓడిపోయాడు.


ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అకీఫ్ గేమ్ ఆడలేదని, వేరే ఎవరితోనో ఆడించి గెలిచాడని నిందుతుడు ఆరోపించాడు. దానికి అకీఫ్ ఒప్పుకోకుండా తనే ఆడానంటూ వాదనకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో పక్కనే ఉన్న పెద్ద రాయితో అకీఫ్ తల పగలగొట్టాడు నిందితుడు. ఈ ఘటనలో అకీఫ్ మృతిచెందాడు.

Updated Date - 2021-04-05T11:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising