ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MGR సోదరుడి కుమార్తె లీలావతి మృతి

ABN, First Publish Date - 2021-11-27T13:37:22+05:30

మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ సోదరుడు, అలనాటి తమిళ సినీనటుడు చక్రపాణి కుమార్తె లీలావతి శుక్రవారం మృతి చెందారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. స్థానిక పెరుంగుడిలో నివసిస్తున్న లీలావతి ఇటీవల తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ సోదరుడు, అలనాటి తమిళ సినీనటుడు చక్రపాణి కుమార్తె లీలావతి శుక్రవారం మృతి చెందారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. స్థానిక పెరుంగుడిలో నివసిస్తున్న లీలావతి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున కన్నుమూశారు. ఎంజీఆర్‌ అమెరికాలోని బ్రూక్లిన్‌ ఆస్పత్రిలో మూత్రాశయ సమస్యలతో చికిత్స పొందుతున్నప్పుడు లీలావతి తన కిడ్నీని దానంగా ఇచ్చారు. లీలావతి కిడ్నీని ఎంజీఆర్‌కు అమర్చటం వల్లే ఆయన ప్రాణగండం నుంచి బయటపడి మరికొన్నేళ్లు జీవించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. లీలావతి మృతి పట్ల అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర సంతాపం తెలిపారు. 1984లో ఆమె కిడ్నీ ఇవ్వడం వలనే ఎంజీఆర్‌ మరికొంతకాలం జీవించగలిగారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2021-11-27T13:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising