ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత తనను నిరాకరించిందనే కోపంతో యువకుడు ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2021-12-21T13:16:39+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనతో అక్రమ సంబంధానికి ఓ వివాహిత నిరాకరించిందనే కోపంతో యువకుడు దారుణానికి పాల్పడ్డాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్వానీ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనతో అక్రమ సంబంధానికి ఓ వివాహిత నిరాకరించిందనే కోపంతో యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని బర్వానీలో తనతో అక్రమ సంబంధానికి వివాహిత నిరాకరించిందనే కోపంతో ఆమె 6 ఏళ్ల కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధబాబావాడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.భార్యాభర్తలైన కూలీలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన 6 ఏళ్ల కుమారుడు కనిపించకుండా పోయాడని దంపతులు ఫిర్యాదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు.పిల్లవాడు దినేష్ భిలాలా అలియాస్ నానా (21)తో కలిసి పొలాల వైపు వెళ్లడం చివరిసారిగా చూశామని ఇరుగుపొరుగు వారు చెప్పారు.


పోలీసులు భిలాలాను 24 గంటల్లోనే నయ్‌దాద్ ప్రాంతంలో పట్టుకున్నారు. బాలుడిని కొట్టి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడితో వివాహిత అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించిందనే కోపంతో ఈ హత్యకు పాల్పడ్డాడని  ఎస్పీ చెప్పారు.భిలాలాను పోలీసు కస్టడీకి తరలించామని, తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. 


Updated Date - 2021-12-21T13:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising