ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణానికి తెగబడ్డ భర్త! భార్య అనారోగ్యంతోె విసిగిపోయి..

ABN, First Publish Date - 2021-03-15T22:29:25+05:30

భార్య అనారోగ్యం..తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులతో విసుగు చెందిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను గొంతుకోసి హత్య చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భార్య అనారోగ్యం, తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులతో విసుగు చెందిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా ముద్గల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మెదడులో కణితి కారణంగా నిందితుడి భార్య కొంత కాలంగా బాధపడుతోందని స్థానిక పోలీసులు తెలిపారు. ఇక కొంత్ కాలంగా ఉద్యోగం లేక భర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో నిందితుడు శనివారం రాత్రి పదునైన కత్తితో భార్యను పొడిచి అంతమొందించాడు. అనంతరం.. రక్తంతో తడిసిన దుస్తులను ఇంటికి సమీపంలో పారేశాడు. ఇదంతా గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను తీసుకున్నారు. ఆదివారం నాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య అనారోగ్యం వైద్య ఖర్చులతో విసుగు చెందిన ఆమెను హత్య చేశాను అని నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్యానేరంతో పాటూ వివిధ సెక్షన్ల కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-03-15T22:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising