ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమను తిరస్కరించిందని కక్షపెంచుకుని...

ABN, First Publish Date - 2021-04-24T18:07:06+05:30

తన ప్రేమను తిరస్కరించిందని కక్షపెంచుకున్న యువకుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇన్‌స్టాగ్రాంలో యువతికి వేధింపులు
  • సైబర్‌ నేరగాడి అరెస్టు

హైదరాబాద్‌ : తన ప్రేమను తిరస్కరించిందని కక్షపెంచుకున్న యువకుడు.. ఇన్‌స్టాగ్రాంలో యువతిని వేధించాడు. చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఎల్లంకి గ్రామానికి చెందిన చాపల ప్రవీణ్‌ చేనేత కార్మికుడు. అదే గ్రామంలోకి ఓ యువతి వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కొద్దిరోజుల్లో ప్రవీణ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. కొంతకాలం గడిచిన తర్వాత ప్రవీణ్‌ ఆ యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆమె అతని ప్రేమను తిరస్కరించింది. అప్పటి నుంచి అతడిని పట్టించుకోవడం మానేసింది. 


ఆ యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమె పరువుతీయాలని భావించాడు. నకిలీ ఇన్‌స్టాగ్రాంను క్రియేట్‌ చేశాడు. ఆ యువతికి ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపాడు. ఆమె యాక్సెప్టు చేసిన తర్వాత అసభ్యకర మెసేజ్‌లు, అభ్యంతరకర ఫొటోలు పోస్టు చేశాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్‌లు పోస్టు చేశాడు. అతని వేధింపులు భరించలేక ఆ యువతి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Updated Date - 2021-04-24T18:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising