ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండె నిండా ప్రేమే ఊపిరి ఆపేసింది.. భర్త మరణించిన 20 నిమిషాలకే ఆ భార్య కూడా..

ABN, First Publish Date - 2021-12-27T23:19:07+05:30

ఆ భార్యకు భర్త అంటే గుండె నిండా ప్రేమే.. భర్త లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఎప్పుడు ఇద్దరూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్: ఆ భార్యకు భర్త అంటే గుండె నిండా ప్రేమే.. భర్త లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఎప్పుడు  ఇద్దరూ అందుకే భర్త మరణించిన 20 నిమిషాలకే ఆ భార్య కూడా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


చౌము ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల సీతారాం శర్మకు 83 ఏళ్ల భన్వరిదేవితో 60 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతంలో సీతారాం భార్యతో కలిసి సిటీలో ఉంటూ పనిచేసేవాడు. అయితే వయసు మీద పడిన తర్వాత ఆ దంపతులు తిరిగి స్వగ్రామానికి వచ్చి ఉంటున్నారు. కొద్ది రోజులుగా సీతారాం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్త త్వరగా కోలుకోవాలని ఆ వృద్ధురాలు ఎన్నో సపర్యలు చేసింది. కానీ సీతారాం సోమవారం ఉదయం చనిపోయాడు. 60 ఏళ్లుగా ఒకరికిఒకరుగా బతికిన ఆ భర్తను విగతజీవిగా చూసి భన్వరిదేవి తట్టుకోలేకపోయింది. భర్త చనిపోయిన 20 నిమిషాలకే ఆమె కూడా ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. 


గంట వ్యవధిలోనే తల్లిదండ్రులు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ వృద్ధ దంపతుల మరణవార్త తెలిసి గ్రామంలోని వారంతా తరలివచ్చారు. వృద్ధాప్యంలో కూడా వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారని.. ఆ దంపతుల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడరు. మరణాన్ని కూడా కలిసి పంచుకున్న ఆ వృద్ధ దంపతులను ఒకే చితిపై దహనం చేశారు. 

Updated Date - 2021-12-27T23:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising