ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోన్‌యాప్‌ కేసుల్లో మరో కీలక వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2021-04-29T17:11:51+05:30

లోన్‌యాప్‌ల కేసు దర్యాప్తులో భాగంగా మరో కీలక వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బెంగళూరుకు చెందిన కలప్ప అరెస్టుతో మొత్తం 22మంది


హైదరాబాద్‌ సిటీ : లోన్‌యాప్‌ల కేసు దర్యాప్తులో భాగంగా మరో కీలక వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు, రిచ్‌మండ్‌ రోడ్‌ నివాసి బి.కె.కలప్ప ఫైన్‌ఎక్స్‌ప్రెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి కంపెనీ ద్వారా హై క్యాష్‌ యాప్‌ అనుసంధానించి ఉంది. దర్యాప్తులో భాగంగా అతను డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ లావాదేవీలపై దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు అతడ్ని బుధవారం బెంగళూరులో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఓ చైనీయుడు (జూవీ అలియాస్‌ ల్యాంబో), ప్రధాన నిందితులు కె.నాగరాజు, సింగి మధుబాబు, పల్లె జీవనజ్యోతిలతోపాటు మొత్తం 22మందిని అరెస్టు చేసినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు. తాజా విచారణలో పలు నకిలీ కంపెనీలను గుర్తించిన అధికారులు పలు ఖాతాలను సీజ్‌ చేసి రూ.400కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-04-29T17:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising