ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం

ABN, First Publish Date - 2021-01-23T17:02:25+05:30

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో టీనేజ్‌ యువతిపై కత్తితో దాడిచేశాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కారణంతో టీనేజ్‌ యువతిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణం నేతాజీనగర్‌కు చెందిన లావణ్య(17) ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, బీటెక్‌లో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే, స్థానిక స్వరాజ్‌నగర్‌కు చెందిన సునీల్‌ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. లావణ్య ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లావణ్య తల్లిదండ్రులు శ్రీనివాసులు, భారతి ఇంటి నుంచి బయటికి వచ్చిన విషయం తెలుసుకున్న సునీల్‌.. 11.45 గంటల సమయంలో టెంకాయలు కొట్టే మచ్చుకత్తితో ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న లావణ్య తల, చేతులపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లావణ్య కేకలు వేయడంతో సునీల్‌ పరారయ్యాడు. గాయపడిన లావణ్యను తల్లిదండ్రులు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివశంకర్‌లు సిబ్బందితో చేరుకుని ఘటన తీరును తెలుసుకున్నారు. లావణ్య పరిస్థితి విషమంగా ఉండటంలో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌లో చేర్పించారు.

Updated Date - 2021-01-23T17:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising