ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశ్రామికవేత్త ఇంట్లో 750 సవర్ల నగల చోరీ

ABN, First Publish Date - 2021-12-30T16:41:43+05:30

జిల్లా గోపాలపట్టినంకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీకి గురైన 750 సవర్ల బంగారు నగల్ని పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

               - పాడుబడిన బావిలో స్వాధీనం


చెన్నై: పుదుకోట జిల్లా గోపాలపట్టినంకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీకి గురైన 750 సవర్ల బంగారు నగల్ని పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలపట్టినం నడువీధిలో జగుబర్‌ సాదిక్‌ (55) అనే పారిశ్రామికవేత్తకు చెందిన విలాసవంతమైన నివాసగృహం ఉంది. సాదిక్‌ బ్రూనేలో సూపర్‌ మార్కెట్లు నడుపుతున్నాడు. తరచూ స్వస్థలానికి వచ్చి ఆ నివాసగృహంలో నివసించి వెళుతుండేవాడు. గత యేడాది నుంచి కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆయన స్వస్థలానికి రాలేదు. ఆయన సోదరి కుటుంబీకులు ఆ నివాసగృహాన్ని తరచూ శుభ్రంచేసి తాళం వేసేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ రాత్రి ఆ నివాసగృహంలో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 750 సవర్ల నగలను దోచుకెళ్ళారు. మరుసటి రోజు ఉదయం సాదిక్‌ సోదరి కుమార్తె ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్ళినప్పుడు చోరీ విషయం బయటపడింది. మీమిసల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు.  దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దింపారు. అదే సమయంలో చోరీ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు బుధవారం పరిశీలిస్తుండగా, ఆ నివాసగృహం వెనుక వున్న పాడుపడిన బావిలో నీలిరంగు పాలిథీన్‌ సంచి వుండడం గమనించారు. వెంటనే బావిలో ఉన్న వర్షపు నీటిని మోటారు పంపుల ద్వారా తోడేశారు. ఆ తర్వాత బావిలోకి దిగిన పోలీసులు ఆ పాలిథీన్‌ సంచిని బావి నుంచి వెలుపలకు తెచ్చి విప్పి చూడగా అందులో చోరీకి గురైన నగలు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-12-30T16:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising