ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేవీలో ఉద్యోగాల పేరుతో మోసం

ABN, First Publish Date - 2021-12-19T17:28:04+05:30

సముద్రతీర రక్షణ దళంలో ఉద్యోగాలు తీసిస్తా మంటూ సుమారు 200 మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని సెంట్రల్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గౌరివాక్కంలో నివసిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - ముగ్గురి అరెస్టు


చెన్నై: సముద్రతీర రక్షణ దళంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు 200 మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని సెంట్రల్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గౌరివాక్కంలో నివసిస్తున్న రాజేష్‌రఘురామ్‌, అతడి అనుచరులు స్వర్ణ సెంథిల్‌, హేమలత కలిసి సముద్ర తీర రక్షణ దళంలో ఉద్యోగాలు ఇపిస్తామని, అందుకు తామే ప్రత్యేక శిక్షణలను అందిస్తామంటూ నిరుద్యోగ యువకుల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపారు. ఆ సందేశాలు చూసి సుమారు 200 మంది శిక్షణ కోసమని, ఉద్యోగనియామకపత్రం కోసం లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారు. ఈ మేరకు మాధవరానికి చెందిన సోమసుందరం వీరికి రూ.5లక్షలను చెల్లించి మోసపోయాడు. మాట ప్రకారం తనకు ఉద్యోగం తీసివ్వకపోవడంతో సోమసుందరం క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపినప్పుడు ఆ ముగ్గురు సుమారు రెండు కోట్లకు పైగా వసూలు చేసి మోసగించినట్టు కనుగొన్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Updated Date - 2021-12-19T17:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising