ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడలు మధ్యాహ్న భోజనం అనంతరం నిద్రపోయిందని అత్తమామలు ఏం చేశారంటే...

ABN, First Publish Date - 2021-11-30T16:35:13+05:30

కోడలు మధ్యాహ్న భోజనం అనంతరం నిద్రపోయిందని అత్తమామలు ఆమెను కొట్టిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ (గుజరాత్): కోడలు మధ్యాహ్న భోజనం అనంతరం నిద్రపోయిందని అత్తమామలు ఆమెను కొట్టిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని షాహిబాగ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ పగటిపూట నిద్రపోయిందనే కోపంతో ఆమెను అత్తమామలతోపాటు భర్త కూడా కొట్టారు.24 ఏళ్ల మహిళ 2016లో మెహసానాలోని కాడికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. మొదటి నుంచి ఉదయాన్నే నిద్ర లేచే కోడలు మధ్యాహ్నం నిద్రపోతోంది. తాను ఉదయాన్నే నిద్ర లేస్తున్నందున మధ్యాహ్నం భోజనం తర్వాత తాను మెలకువగా ఉండలేనని కోడలు చెప్పింది.మొదట మధ్యాహ్నం భార్య నిద్రపోతుందని భర్త కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


కానీ వారు రాజీ కుదుర్చుకున్న తర్వాత భర్తతో కలిసి జీవించడానికి కాపురానికి వెళ్లింది.ఆ తర్వాత కూడా పరిస్థితులు మెరుగుపడలేదని, తాను గర్భవతిగా ఉన్నపుడు నా భర్త, అత్తమామలు తనకు సహాయం చేయలేదని, తన తల్లిదండ్రుల ఇంటికి పంపించారని కోడలు చెప్పింది.2017 సెప్టెంబరు 18వతేదీన ఆడపిల్లకు జన్మనిచ్చింది. మగబిడ్డకు జన్మనివ్వనందుకు తనను భర్త, అత్తమామలు వేధించారని కోడలు చెప్పింది.ఈ ఏడాది ఫిబ్రవరి 7న తన భర్త తనను విడిచిపెట్టాడని భార్య ఆరోపించింది. సంఘం నాయకులు జోక్యం చేసుకున్నప్పటికీ ఆమె భర్త ఆమెను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత ఆమె మాధవపుర పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, అత్తమామలపై గృహ హింసచట్టం కింద వివాహిత ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2021-11-30T16:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising