ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికపై హత్యాచారం కేసులో నెలరోజుల్లోనే పోక్సో కోర్టు తీర్పు

ABN, First Publish Date - 2021-12-07T15:27:52+05:30

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ చేసిన నెల రోజుల్లోనే నిందితుడిని గుజరాత్ ప్రత్యేక పోక్సో కోర్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ చేసిన నెల రోజుల్లోనే నిందితుడిని గుజరాత్ ప్రత్యేక పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది.నవంబర్ 4వతేదీన మైనర్ బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, ఉరేసి హత్య చేశాడు. ఈ సంచలన కేసులో 35 ఏళ్ల వలస కార్మికుడిని గుజరాత్‌లోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా నిర్ధారించింది. మంగళవారం తీర్పును ప్రకటించనుంది.భారతీయ శిక్షాస్మృతి,పోక్సో చట్టం ప్రకారం కిడ్నాప్, అత్యాచారం, హత్య వంటి వివిధ ఆరోపణల కింద నిందితుడు గుడ్డు యాదవ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.విచారణ చివరి రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దోషి బీహార్‌కు చెందినవాడని, ప్రస్తుతం  భార్య, ఇద్దరు పిల్లలతో సూరత్ నగరంలోని పండేసర ప్రాంతంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.సత్వరమే న్యాయం జరిగేలా పందేసర పోలీసులు ఏడు రోజుల్లో చార్జిషీటును సమర్పించారు. 43 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.


Updated Date - 2021-12-07T15:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising