ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుకుంటున్న బాలికకు మెసేజ్ చేసి రమ్మన్నాడు.. అన్నయ్య ఫ్రెండే కదా అని పరిగెత్తుకుంటూ వెళ్లింది.. తరువాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-10-23T13:31:13+05:30

బాలికలకు మాయమాటలు చెప్పి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలికలకు మాయమాటలు చెప్పి, వంచనకు పాల్పడుతున్న యువకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జష్ఫూర్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితుని సోదరిపై అత్యాచారం జరిపాడు. ఆ బాలికకు అర్థరాత్రి దాటాక మెసేజ్ పంపించి, బయటకు రావాలని పిలిచాడు. ఆ బాలిక రాగానే ఆమెను బలవంతంగా సమీపంలోని ఒక శిథిల భవనంలోనికి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా కుటుంబ సభ్యులకు చెప్పింది.


వారు వెంటనే ఈ సంగతిని పోలీసులకు తెలియజేశారు. వారు రంగంలోకి దిగి నిందితుడిని కేవలం మూడు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. ఉదయాన్నే కోర్టుకు తరలించి, సాయంతానికి జైలుకు పంపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బగీచా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న అజయ్ కుమార్ ప్రజాపతి స్థానికంటా ఉంటున్న ఒక యువకునితో స్నేహం చేస్తున్నాడు. దీంతో అతను స్నేహితుని ఇంటికి తరచూ వస్తూపోతూ ఉండేవాడు. ఈ నేపధ్యంలో అతనికి స్నేహితుని 13 ఏళ్ల సోదరితో పరిచయం ఏర్పడింది. రోజూ మాదిరిగానే రాత్రివేళ ఆ బాలిక చదువుకుంటోంది. ఇంతలో అజయ్ ఆ బాలికకు వాట్సాప్‌లో తనను కలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు రావాలంటూ మెసేజ్ పంపించాడు. వెంటనే ఆ బాలిక.. పిలిచింది తన అన్నయ్య ఫ్రెండే కదా అని ఎటువంటి అనుమానం లేకుండా బయటకు వచ్చింది. వెంటనే అజయ్ ఆ బాలికను పక్కనే ఉన్న శిథిల భవనంలోకి లాక్కెళ్లి, అత్యాచారం జరిపి పారిపోయాడు. ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి, జరిగిన సంగతి ఇంట్లోనివారికి తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఒక బృందంగా ఏర్పడి, నిందితుని కోసం గాలింపుజరిపి పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.



Updated Date - 2021-10-23T13:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising