ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం... వ్యాన్ డ్రైవర్‌పై ఆరోపణలు... ఇంతలోనే ఘోరం

ABN, First Publish Date - 2021-10-06T15:55:35+05:30

దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మానవ మృగాల ఆగడాలు అంతకంతకూ విజృంభిస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. హరియాణాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే దీనిలో ఒక ట్విస్టు చోటుచేసుకుంది. సోనీపత్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి స్థానికంగా ఉంటున్న ఒక చిన్నారిని వ్యానులో పట్టణంలోని ఒక స్కూలుకు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటాడు. అయితే ఆ వ్యక్తి తమ నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వ్యాను డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.


ఈ విషయం తెలుసుకున్న వ్యాను డ్రైవర్ ఢిల్లీలోని రోహిణీలో గల తన బంధువుల ఇంటికి వెళ్లి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఆత్మహత్యకు బాలిక కుటుంబీకుల తప్పుడు ఆరోపణలే కారణమని వ్యాను డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన అతని కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయ్నతం చేశారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆ చిన్నారి కుటుంబీకులు చెప్పేవరకూ తాము ఆందోళన విరమించేది లేదని వారు తెగేసి చెప్పారు.  పోలీసులు వారిని ఒప్పించి సమస్య సద్దుమణిగేలా చూశారు. 


Updated Date - 2021-10-06T15:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising