ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి పేరుతో ఐదుగురు వరులకు వధువు టోకరా

ABN, First Publish Date - 2021-03-29T15:26:11+05:30

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు వరులకు టోకరా ఇచ్చి పారిపోయిన వధువు ఉదంతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భోపాల్ (మధ్యప్రదేశ్): పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు వరులకు టోకరా ఇచ్చి పారిపోయిన వధువు ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో వెలుగుచూసింది. హర్దా జిల్లాకు చెందిన ఓ వరుడు పెళ్లి ముహూర్తం రోజు తన బంధుమిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు తరలివచ్చాడు.వివాహ మండపానికి తాళం వేసి ఉండటం చూసిన వరుడు షాక్ కు గురయ్యాడు. వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ చేసి ఉన్నాయి. దీంతో వధువుపై ఫిర్యాదు చేసేందుకు వరుడు కోలార్ రోడ్ పోలీసుస్టేషనుకు వచ్చాడు. అక్కడ మరో నలుగురు వరులు అదే వధువు మోసం చేసిందంటూ ఫిర్యాదు  చేసేందుకు బారులు తీరి ఉండటం చూసి వరుడు మరోసారి దిగ్ర్భాంతి చెందాడు. వధువుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులున్న ముఠాపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి భూపేందర్ సింగ్ చెప్పారు. వధువును చూపించి పెళ్లి ఖరారు చేసి వరుడి నుంచి 20వేల రూపాయలు తీసుకొని వారు పరారవటం ఈ ముఠా వ్యూహమని పోలీసులు చెప్పారు. ఐదుగురు వరులను మోసగించి వధువుతో సహా, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశామని భోపాల్ పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-03-29T15:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising