ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి పేరుతో కోట్లు కొట్టేసిన కేసులో వెలుగుచూస్తున్న నిజాలు!

ABN, First Publish Date - 2021-02-26T14:32:46+05:30

ఐపీఎస్‌ అధికారి ముసుగులో ఓ మైనింగ్‌ వ్యాపారిని మాయమాటలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నిజాంపేట్‌ : ఐపీఎస్‌ అధికారి ముసుగులో ఓ మైనింగ్‌ వ్యాపారిని మాయమాటలతో మోసం చేసి 11.5 కోట్లు దండుకోగా మరిన్ని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధితులు గుట్టు చప్పుడు కాకుండా పోలీస్‌ అధికారులను సంప్రదించి తమ గోడును వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. మోసకారి మహిళను సైబరాబాద్‌ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరారెడ్డి అనే మైనింగ్‌ వ్యాపారిని మోసం చేసి రూ.11.5 కోట్లు దండుకున్న విషయం తెలిసిందే.


విజయ్‌కుమార్‌రెడ్డి, శృతిసిన్హాల మధ్య చిన్నపాటి వివాదాలు రావడం, వీరు సాగిస్తున్న వ్యవహారాలు బయటకు వస్తున్నాయన్న ఆలోచనతోనే విజయ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 5న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, అతడి సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియోలు ఇవ్వడం విచారణకు బలం చేకూరింది. ఫిర్యాదు అందిన దగ్గర నుంచి పటిష్టమైన నిఘాతో ఈ కేసును విచారించారు. ఐదున్నర కోట్లు మాత్రం బ్యాంక్‌ ట్రాన్సెక్షన్‌ ద్వారా జరిగింది. మిగిలిన డబ్బును వేరే మార్గంలో లాగేశారు. ఈ కేసులో నలుగురిని రిమాండ్‌ చేయగా మరో నిందితుడు అభిషేక్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-02-26T14:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising