ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌బుక్‌లో పరిచయం.. ప్రేమ పెళ్లి.. కొద్ది నెలలకే భర్త ఆత్మహత్య.. అనుమానంతో ఆ భార్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటా అని చెక్ చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు..!

ABN, First Publish Date - 2021-10-15T00:18:12+05:30

వారిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి, చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అయితే అంతగా ఇష్టపడి వివాహం చేసుకున్న ఆ భర్త.. ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి, చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అయితే అంతగా ఇష్టపడి వివాహం చేసుకున్న ఆ భర్త.. ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో భార్య గురించి ఆరాతీయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ గోవర్ధన్ విలాస్ ప్రాంతానికి చెందిన సైనిక్‌సింగ్ అలియాస్ సుమిత్‌కు ఫేస్‌బుక్‌లో తనూష్క అలియాస్ భారతి అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే పెళ్లికి వారి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారికి తెలియకుండా ఏడాది క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వారి సంసారం సాఫీగానే సాగింది. అయితే నెల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తనుష్క అతడిని వదిలి వెళ్లిపోయింది. వరకట్నం కోసం తనను తరచూ వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


 అయితే కేసు వెనక్కు తీసుకోవాలంటే తనకు రూ.5లక్షలు ఇవ్వాలని సుమిత్‌‌ని తరచూ వేధించేది. భార్య నుంచి వేధింపులు ఎక్కువ అవడంతో సోమవారం తన ఇంట్లో విషం తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అయితే సుమిత్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. తనుష్కకు అప్పటికే పదేళ్ల కుమారుడు ఉన్నాడని తెలిసింది.


అంతేకాకుండా ఆమె గతంలో ఇలాగే నలుగురిని వివాహం చేసుకుని, వరకట్న కేసులు పెట్టి.. తద్వారా వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసిందని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. తన మాజీ భర్తల నుంచి భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు తేలింది. సుమిత్‌కు తన బంధువులు అని పరిచయం చేసిన వారంతా నకీలీ వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.  రాజస్థాన్‌లో ఇలాంటి పలువురు మహిళలపై గతంలో అనేక కేసులు నమోదైనట్లు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా యువకులతో పరిచయం పెంచుకుని మోసం చేస్తుంటారని దర్యాప్తులో తేలింది.

Updated Date - 2021-10-15T00:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising